బీఎస్ఎఫ్ జవాను భూ సమస్యను 24 గంటల్లో పరిష్కరించాం! మంత్రి నారా లోకేశ్!
Wed Jun 04, 2025 09:05 Politics.202506045164.jpg)
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఉదుకూరు గ్రామానికి చెందిన డి. నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ జవానుగా దేశ సేవలో ఉన్నారు. ఆయన భార్య తల్లిదండ్రులకు చెందిన 2 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి రాజకీయ ప్రభావం చూపించి అక్రమంగా కబ్జా చేశాడు అని నరసింహమూర్తి ఆరోపించారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ కుటుంబానికి న్యాయం చేయలేక పోతున్నానని వేదనతో, జమ్మూకశ్మీర్ నుంచే సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెలిబుచ్చారు. ఈ వీడియో మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు.
లోకేశ్ ఆదేశాలపై శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. తహశీల్దార్, స్థానిక పోలీసులు కె.శివరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించి, సర్వే చేసి, రికార్డులు పరిశీలించారు. అనంతరం, హద్దులు నిర్ణయించి భూమిని నరసింహమూర్తి కుటుంబానికి అప్పగించారు. కేవలం 24 గంటల్లోనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, సైనికుల సంక్షేమమే ప్రాధాన్యం అని, భవిష్యత్తులో కూడా వారు ఎదుర్కొనే ఏ సమస్యకైనా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #BSFHero #JusticeServed #LandDispute #APGovtAction #SupportSoldiers #QuickResponse #SoldiersWelfare #NaraLokesh #PublicService #24HrJustice
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.